మహేష్ కొత్త సినిమా మే 31న ప్రారంభం

Published on Apr 15,2020 04:58 PM
మహేష్ బాబు కొత్త సినిమా మే 31న ప్రారంభం కానుంది. ఆరోజే మహేష్ కొత్త సినిమా ఎందుకు ప్రారంభం అవుతుందో తెలుసా ...... ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మరి. అవును తన తండ్రి కృష్ణ అంటే అంతులేని ప్రేమ మహేష్ బాబుకు దాంతో ఆరోజున తన కొత్త సినిమా స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు మహేష్. గత ఏడాది మే 31 న ప్రారంభమై ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు ప్రభంజనం సృష్టించింది. ఆ సెంటిమెంట్ కూడా ఉంది కనుక మే 31న మహేష్ కొత్త సినిమా ప్రారంభం కానుంది.

ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించేది పరశురామ్. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత పరశురామ్ నుండి వస్తున్న సినిమా ఇదే. కరోనా మహమ్మారి లేకుంటే ఈపాటికి ఈ సినిమా వివరాలు ప్రకటించేవాళ్ళు కానీ కరోనా విలయతాండవం చేస్తుండటంతో కొద్దిరోజుల తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారట. మహేష్ బాబు కోసం పరశురామ్ రెండేళ్లు గా ఎదురు చూస్తున్నాడు. అది ఇప్పటికి నెరేవేరుతోంది.