వైజాగ్ , బెంగుళూర్ లలో మహేష్ మల్టీప్లెక్స్

Published on Feb 22,2020 12:30 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగిన మహేష్ అందులో మొదటగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏ ఎం బి ని కట్టించాడు. అధునాతనమైన ఫీచర్స్ తో ఉన్న ఈ మల్టీప్లెక్స్ అనతికాలంలోనే విశేషంగా ప్రాచుర్యం పొందింది. కట్ చేస్తే దాని వల్ల భారీగా లాభాలు వస్తుండటంతో వైజాగ్ లో అలాగే బెంగుళూర్ లలో కూడా ఏ ఎం బి ని కట్టాలని పెద్ద మాస్టర్ ప్లాన్ చేసాడట మహేష్.

వైజాగ్ లో అలాగే బెంగుళూర్ లలో ఇప్పటికే స్థలాలను చూసారని , హైదరాబాద్ లో లాగే అక్కడి ప్రేక్షకులను అలరించేలా మల్టీప్లెక్స్ ని తీర్చి దిద్దే పనిలో పడ్డాడు మహేష్ బాబు. డబ్బులు మహేష్ బాబు అలాగే పేరు మహేష్ బాబుది కానీ వెనకాల ఉండి అంతా చూసుకునేది మహేష్ భార్య నమ్రత అలాగే ఏషియన్ సునీల్ నారంగ్ లు. తాజాగా మహేష్ బాబు వంశీ పైడిపల్లి తో మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.