మహేష్ బాబు ఇమేజ్ డ్యామేజ్

Published on Feb 23,2019 05:52 PM

మహేష్ బాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది . 35 లక్షల 66  వేల రూపాయలను వినియోగ దారుల సంక్షేమ సంఘంకు మహేష్ బాబు విరాళం ఇచ్చినట్లు ప్రకటించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . అసలు మహేష్ బాబు చేసిన పని తప్పు అయినప్పటికీ దాన్ని  ఓ సంక్షేమం కోసం ఇచ్చినట్లుగా ప్రకటించడం మరీ దారుణం . 

అసలు విషయం ఏంటంటే ...... మహేష్ బాబు థియేటర్ లలో ఎక్కువ జీఎస్టీ వసూల్ చేసారు ప్రేక్షకుల దగ్గర . అది నేరం కూడా . కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లని తగ్గించినప్పటికీ మహేష్ బాబు థియేటర్ లలో మాత్రం జీఎస్టీ ని తగ్గించలేదు . ప్రేక్షకుల దగ్గర ఎక్కువ మొత్తం వసూల్ చేసారు . అది లెక్కేస్తే 36 లక్షల 66 వేలు అయ్యింది దాంతో ఆ సొమ్ము ని వినియోగ దారుల సంక్షేమ నిధికి ఇచ్చినట్లుగా క్రియేట్ చేసారు . అయితే ఆ సొమ్ము ప్రేక్షకుల దగ్గర అక్రమంగా వసూల్ చేసిన సొమ్ము మరి .