విజయ్ ని టార్గెట్ చేసిన మహేష్ ఫ్యాన్స్

Published on Apr 02,2020 03:42 PM
ఇళయదళపతి విజయ్ ని టార్గెట్ చేసారు టాలీవుడ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్. విజయ్ తమిళనాడు సూపర్ హీరో ఇక మహేష్ బాబు టాలీవుడ్ హీరో అయినా ఈ ఇద్దరికీ గొడవలు ఏంటి ? అనే కదా ! మీ డౌట్ !! గొడవ ఈ ఇద్దరు హీరోలకు కాదు ఈ ఇద్దరు హీరోలను అభిమానించే అభిమానుల ఫైటింగ్. విజయ్ ఫ్యాన్స్ మహేష్ బాబుని డమ్మీ స్టార్ అంటుంటే మహేష్ ఫ్యాన్స్ విజయ్ ని ట్రోల్ చేస్తున్నారు.

మహేష్ బాబు నటించిన పోకిరి , ఒక్కడు చిత్రాలను తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేసాడు. అవి కూడా తమిళంలో పెద్ద హిట్ అయ్యాయి. అయితే మహేష్ బాబు కంటే మా హీరోనే అద్భుతంగా నటించాడు అని విజయ్ ఫ్యాన్స్ మహేష్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు దాంతో మహేష్ ఫ్యాన్స్ విజయ్ ని టార్గెట్ చేసారు. మొత్తానికి అభిమానుల వల్ల ఇద్దరు స్టార్ హీరోలకు వచ్చింది ఇబ్బంది.