రెచ్చిపోయిన మహేష్ ఫ్యాన్స్

Published on Dec 26,2019 02:04 PM

మహేష్ బాబు తో ఫోటో దిగడానికి హైదరాబాద్ రావాలంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆహ్వానించి తీరా ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి వస్తే సరైన ఏర్పాట్లు చేయకపోగా బౌన్సర్ లతో కొట్టిస్తారా ? అంటూ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మహేష్ ఫ్యాన్స్. అంతేకాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన బ్యారికేడ్ లను పడగొట్టేసి కుర్చీలను విరగ్గొట్టి రచ్చ రచ్చ చేసారు. మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోతుంటే అక్కడ అంతా గందరగోళం నెలకొంది. అయితే ఇదే సంఘటనలో కొంతమంది ఫ్యాన్స్ కు గాయాలు కాగా ఇద్దరికి కాళ్ళు విరిగినట్లు సమాచారం అందుతోంది.

పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. అల్యుమియం ఫ్యాక్టరీ లో గొడవ జరుగుతోంది అన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల అనుమతి లేకుండా ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను నిలదీసి అక్కడి నుండి మహేష్ బాబు ని అలాగే ఫ్యాన్స్ ని పంపించేశారు. మహేష్ బాబు తో ఫోటో దిగుదామని ఎంతో ఆశగా వచ్చిన వాళ్లకు నిరాశ ఎదురు కావడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముందుగా పోలీసుల అనుమతి తీసుకొని ఉంటే ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అయ్యేది కానీ అలా చేయకుండా అభిమానులను రప్పించి ఇబ్బందికి గురిచేసారు ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ.