దేవిని వద్దంటున్న మహేష్ ఫ్యాన్స్

Published on Feb 14,2020 06:24 PM

దేవిశ్రీ ప్రసాద్ ని మహేష్ బాబు తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడిగా పెట్టొద్దని దర్శకులు వంశీ పైడిపల్లిని డిమాండ్ చేస్తున్నారు మహేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్. గతకొంత కాలంగా దేవిశ్రీ ప్రసాద్ తన మ్యాజిక్ కి తగ్గట్లుగా మ్యూజిక్ ఇవ్వలేకపొతున్నాడు. పాటలు బాగానే ఉంటున్నాయి కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా , మొదటిసారి వినగానే ఆకట్టుకునేలా ఉండటం లేదు దాంతో దేవిశ్రీ ప్రసాద్ కు బదులుగా మరొకరిని తీసుకోండని అభ్యర్థిస్తున్నారు వంశీ పైడిపల్లిని.

సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. సినిమాలో పాటలు బాగానే ఉన్నప్పటికీ అల ..... వైకుంఠపురములో అంతగా ఫేమస్ కాలేదు దాంతో దేవిని వద్దని అంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన తదుపరి చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా మేలో ప్రారంభం కానుంది దాంతో మణిశర్మ ని తీసుకునే ఆలోచన చేస్తున్నాడట దర్శకుడు వంశీ.