డ్యాన్స్ తో ఇరగదీసిన మహేష్ కూతురు

Published on Feb 14,2020 06:25 PM

మహేష్ బాబు కూతురు సితార డ్యాన్స్ లో అదరగొడుతుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పాటలకు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ని అలరించిన సితార తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని డాంగ్ డాంగ్ అనే పాటకు డ్యాన్స్ చేసి దాన్ని యూట్యూబ్ లో పెట్టి సంచలనం సృష్టిస్తోంది. సితార కు ఓ యూట్యూబ్ ఛానల్ ఉందన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఈ యూట్యూబ్ ఛానల్ ని పెట్టింది సితార .

ఇక అప్పటి నుండి మహేష్ బాబు నటించిన పలు చిత్రాల్లోని పాటలకు డ్యాన్స్ చేస్తూ వాటిని తన యూట్యూబ్ లో పెట్టేస్తూ మహేష్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అసలే ముద్దులొలికే రూపం ఆపై ఆకట్టుకునే డ్యాన్స్ చేస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పాటలకు డ్యాన్స్ చేయడమే కాదు సుమా ! పాటలు కూడా అందంగా పాడుతుంది సితార. తన కూతురు యాక్టివిటీస్ చూసి షాక్ అవుతుంటాడు మహేష్.