మహేష్ కూతురు డ్యాన్స్ తో అదరగొట్టింది

Published on Oct 28,2019 06:30 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార చాలా బాగా డ్యాన్స్ చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తనకంటూ ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకున్న విషయం కూడా విదితమే! సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్జ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు చిత్రాల్లోని పాటలను పాడటమే కాకుండా డ్యాన్స్ కూడా చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

తాజాగా దీపావళి పండగ సందర్బంగా చక్కగా ముస్తాబైన సితార డ్యాన్స్ తో అలరించింది. సితార డ్యాన్స్ చేస్తుంటే ఆ డ్యాన్స్ ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసింది మహేష్ భార్య నమ్రత. ఇప్పుడా వీడేమో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. సితార డ్యాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.