ఓవర్ సీస్ లో మహేష్ జోరు మాములుగా లేదుగా !

Published on Dec 26,2019 01:56 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు జోరు మాములుగా లేదు ! సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలకు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉన్నప్పటికీ అప్పుడే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దాదాపు లక్ష డాలర్లను పట్టేసింది. మహేష్ బాబు కున్న క్రేజ్ కు కొలమానం ఈ సంకేతం అనే చెప్పాలి. మహేష్ బాబు ఓవర్ సీస్ మొనగాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో కాస్త తెలుగు చిత్రాల జోరు తగ్గింది వసూళ్ల పరంగా దాంతో కొంత ఆందోళన చెందుతున్నారు ఓవర్ సీస్ బయ్యర్లు.

అయితే ఆలోటుని సరిలేరు నీకెవ్వరు భర్తీ చేసేలా కనబడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించినవే! దాంతో తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించడమే కాకుండా భారీ కలెక్షన్స్ ని సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. అనిల్ రావిపూడి చిత్రాలలో ఒకవైపు యాక్షన్ ఉంటూనే మరోవైపు వినోదానికి అగ్రతాంబూలం ఇస్తుంటాడు , ఇక ఓవర్ సీస్ లో యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ ఎక్కువ లభిస్తుండటంతో సరిలేరు నీకెవ్వరు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి మరి. ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. ఇక ఈ చిత్రాన్ని జనవరి 11 న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు అయితే ఓవర్ సీస్ లో మాత్రం జనవరి 10నే విడుదల కానుంది.