ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ కొట్టేసిన మహేష్

Published on Jan 11,2020 11:30 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవర్ సీస్ మొనగాడు అన్న విషయం తెలిసిందే. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరోసారి ఓవర్ సీస్ మొనగాడు అని నిరూపించుకున్నాడు. కేవలం ప్రీమియర్ షోల తోనే 1 మిలియన్ డాలర్లకి కొట్టేసాడు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఓవర్ సీస్ లో ముందుగానే షోలు పడతాయనే విషయం తెలిసిందే. దాంతో ప్రీమియర్ షోలు ముందుగానే పడ్డాయి టాక్ కూడా వచ్చేసింది, ఇక కలెక్షన్లు అయితే సునామీ సృష్టించడం ఖాయమని అంటున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఉంది దాంతో తప్పకుండా ఓవర్ సీస్ ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయమని తెలుస్తోంది. హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఇప్పటికే వన్ మిలియన్ డాలర్లకి రాబట్టింది కాబట్టి తప్పకుండా లాంగ్ రన్ లో 3 మిలియన్ డాలర్లను వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.