2019 లో మహేష్ బాక్సాఫీస్ రిపోర్ట్

Published on Jan 02,2020 06:32 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం 2019 లో విడుదల అయ్యింది. 130 కోట్ల భారీ బడ్జెట్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు అశ్వినీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించడం విశేషం. మే 9 న భారీ ఎత్తున విడుదలైన మహర్షి చిత్రం 175 కోట్ల గ్రాస్ వసూళ్లని ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే మహేష్ బాబు సరసన నటించింది.

ఈ సినిమా ఎక్కువ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకోవడంతో పాటుగా విదేశాలలో కూడా పెద్ద ఎత్తున షూటింగ్ జరుపుకోవడంతో ఎక్కువ బడ్జెట్ అయ్యింది. 130 కోట్ల బడ్జెట్ కాగా అందులో వచ్చింది 175 కోట్ల గ్రాస్ మాత్రమే! అంటే 95 కోట్లకు పైగా షేర్ మాత్రమే వసూల్ అయ్యింది. మిగతా సొమ్ము శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో నిర్మాతలకు వచ్చాయి దాంతో వాళ్ళు స్వల్పంగా లాభపడ్డారు కూడా. కానీ కొంతమంది బయ్యర్లు మాత్రం సేఫ్ కాలేకపోయారు. అయితే మహర్షి చిత్రం మహేష్ బాబు మనసుకి బాగా దగ్గరైన సినిమాగా మహర్షి నిలిచింది. రైతుల సమస్యలపై రూపొందిన ఈ చిత్రంతో 2019 లో హిట్ కొట్టాడు మహేష్ బాబు. ఇక 2020 ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ముందుకు వస్తున్నాడు మహేష్.