కేజిఎఫ్ దర్శకుడితో మహేష్ బాబు

Published on Nov 13,2019 12:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కేజిఎఫ్ వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని 2020 జనవరి లో సంక్రాంతి కానుకగా 12న విడుదల కానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.

ఇక ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు మహేష్ బాబు. అయితే కొంత గ్యాప్ తీసుకుంటాడట ఈ సినిమా కోసం. ఎందుకంటే మహేష్ బాబు ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడట. అందుకోసమే మేకోవర్ కావడానికి కొంత గ్యాప్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ తో ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ నీల్ మహేష్ బాబు ని ఎలా చూపిస్తాడో అన్న ఆత్రుత నెలకొంది.