పైచేయి సాధించిన మహేష్ బాబు

Published on Dec 14,2019 01:04 PM

అల్లు అర్జున్ కంటే పైచేయి సాధించాడు మహేష్ బాబు టీజర్ విషయంలో. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్ర టీజర్ విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్ నటించిన అల ..... వైకుంఠపురములో టీజర్ కు ఆశించిన స్థాయిలో స్పందన లేకుండాపోయింది అలాగే విమర్శలు కూడా వస్తున్నాయి టీజర్ పట్ల. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని పోలినట్లుగా ఉంది అల ..... వైకుంఠపురములో టీజర్. దాంతో టీజర్ ని పోల్చి చూస్తే అల్లు అర్జున్ మీద మహేష్ బాబు పై చేయి సాధించినట్లు అయ్యిందని అంటున్నారు.

ఇక ఈ రెండు సినిమాలు కూడా ఒకరోజు తేడాలో విడుదల కానున్నాయి. జనవరి 11 న మహేష్ సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతుండగా జనవరి 12న అల్లు అర్జున్ అల ..... వైకుంఠపురములో చిత్రం విడుదల కానుంది. దాంతో ఈ రెండు చిత్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే టీజర్ విషయంలో మహేష్ బాబు దే పైచేయి అయినప్పటికీ పాటల విషయంలో మాత్రం అల్లు అర్జున్ పైచేయి సాధించాడు. అల్లు అర్జున్ చిత్రానికి తమన్ సంగీతం అందించగా రెండు పాటలైతే సంచలనం సృష్టించాయి. ఇక మహేష్ బాబు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.