ఏ హీరోకు లేని రికార్డ్ మహేష్ బాబు సొంతం

Published on Feb 15,2020 08:40 PM

ఏ హీరోకు లేని రికార్డ్ మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు. యూట్యూబ్ లో పలు చిత్రాలకు బ్రహ్మాండమైన వ్యూస్ వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంతో 100 మిలియన్ వ్యూస్ దరిదాపుల్లో ఉన్నాడు. 2017 లో విడుదలైన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా అప్పుడు ఈ సినిమాని యూట్యూబ్ లో పెట్టగా ఇప్పటికి 9 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి మరి కొద్దీ రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

మన తెలుగు చిత్రాలకు 100 మిలియన్ లకు పైగా వ్యూస్ వస్తున్నాయి కదా యూట్యూబ్ లో అనుకుంటున్నారా ? ఆ చిత్రాలు హిందీలో డబ్ చేసినవి కావడం విశేషం. కానీ ఈ శ్రీమంతుడు చిత్రం మాత్రం నేరుగా 9 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. డైరెక్ట్ తెలుగు చిత్రాల్లో ఇంతటి ప్రేక్షాధారణ పొందిన చిత్రాలు ఏవి లేవు అలాగే ఏ హీరో కూడా ఆ రికార్డ్ ని సొంతం చేసుకోలేదు అది కేవలం ఒక్క మహేష్ బాబు కు మాత్రమే సాధ్యమయ్యింది.