న్యూ ఇయర్ వేడుకల కోసం వెళ్లిన మహేష్ బాబు

Published on Dec 27,2019 10:58 PM

న్యూ ఇయర్ వేడుకల కోసం ఫారిన్ వెళ్ళాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. చిన్న గ్యాప్ దొరికినా చాలు ప్రపంచాన్ని చుట్టేయడానికి వెళుతుంటాడు మహేష్ బాబు. ఈ హీరో ఒక్కడే కాకుండా తన భార్య పిల్లలతో కలిసి విదేశీ టూర్ లకు వెళ్తుంటాడు. తాజాగా భార్య నమ్రత , కొడుకు గౌతమ్ , కూతురు సితార లతో కలిసి ఫారిన్ వెళ్ళాడు. కొత్త సంవత్సరం మరో నాలుగు రోజుల్లో రాబోతోంది దాంతో ఆ కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి విదేశాలకు చెక్కేసాడు మహేష్ బాబు. ఇప్పటికే పలుమార్లు ఫారిన్ టూర్ లకు వెళ్లిన మహేష్ మరోసారి ఫారిన్ బాట పట్టాడు.

తన భార్యా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ అభిమానులకు కూడా చక్కని సందేశాన్ని అందిస్తున్నాడు ఈ సూపర్ స్టార్. అయితే మళ్ళీ ఇండియాకు జనవరి 3 నే రానున్నాడు ఎందుకంటే జనవరి 5 న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ కు ముఖ్య అథితి గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు మరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.