మేనల్లుడికి సలహా ఇచ్చిన మహేష్ బాబు

Published on Nov 11,2019 05:16 PM

బాగా కస్టపడి పనిచెయ్ ........ నువ్ నేర్చుకున్నదంతా ఇవ్వు అపుడే ఆ విజయం నీ పంచన చేరుతుంది అంటూ  సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేనల్లుడు గల్లా అశోక్  కు సలహా ఇచ్చాడు. నిన్న మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఆ సందర్బంగా మేనల్లుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసాడు మహేష్ బాబు.

గుంటూరు పార్లమెంట్ సభ్యుడైన గల్లా జయదేవ్ కొడుకు ఈ గల్లా అశోక్. ఇక ఈ సినిమాకు నిర్మాత మహేష్ బాబు పెద్దక్క గల్లా పద్మావతి నిర్మాత కావడం విశేషం. తమ వారసుడిని హీరోగా పరిచయం చేస్తూ ఇతర నిర్మాతల చేతిలో పెట్టేకంటే తామే రిస్క్ చేయడం మంచిదని భావించి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు గల్లా జయదేవ్ కుటుంబం. మేనమామ మహేష్ బాబు ఆశీస్సులు అలాగే కృష్ణ - మహేష్ బాబు అభిమానుల అండ పుష్కలంగా ఉంది గల్లా అశోక్ కు అయితే ప్రేక్షకుల ఆదరణ ఉందా ? లేదా ? అన్నది మాత్రం ఆ సినిమా అయ్యాక కానీ తెలీదు.