144 కోట్ల షేర్ సాధించిన మహేష్ బాబు

Published on Feb 05,2020 04:52 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 144 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించాడు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో. సంక్రాంతి బరిలో జనవరి 11 న విడుదలైన సరిలేరు నీకెవ్వరు భారీ వసూళ్ళని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు , అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. 13 ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు 240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని సాధించగా 144 కోట్ల షేర్ బయ్యర్ ల వశం అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్ళని సాధించి సంక్రాంతి రేంజ్ ని పెంచింది. భారీ వసూళ్లు రావడంతో బయ్యర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. థియేట్రికల్ రైట్స్  రూపంలో భారీ మొత్తం రాగా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తం వచ్చింది దాంతో నిర్మాతలు కూడా భారీ మొత్తంలో లాభాలు తెచ్చుకుంటున్నారు.