రజనీ భాషా రేంజ్ లో మహేష్ బాబు సినిమా

Published on Feb 06,2020 09:28 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం భాషా. కాగా ఆ భాషా చిత్రం రేంజ్ లో మహేష్ బాబు తాజాగా నటించనున్న చిత్రం ఉండనుందట. మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇక సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మహేష్ బాబు నటించనున్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. మహర్షి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఈ సినిమా రానుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు ని భాషా సినిమాలో రజనీకాంత్ మాదిరిగా పవర్ ఫుల్ గా చూపించనున్నాడట వంశీ పైడిపల్లి. మహేష్ బాబు క్యారెక్టర్ లో రెండు పార్శ్వాలు ఉండనున్నాయట ఈ చిత్రంలో. గూఢచారి పాత్రలకు పెట్టింది పేరు కృష్ణ దాంతో మహేష్ బాబు ని అటు రజనీకాంత్ ఫ్యాన్స్ ఇటు కృష్ణ ఫ్యాన్స్ మెచ్చేలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట వంశీ. ఈ సినిమా మేలో సెట్స్ మీదకు వెళ్లనుంది.