మరో బ్రాండ్ ని పట్టేసిన మహేష్ బాబు

Published on Mar 10,2020 08:03 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో బ్రాండ్ ని పట్టేసాడు. ఇప్పటికే మహేష్ బాబు చేతిలో 22 బ్రాండ్ లు ఉన్నాయి. రకరకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు మహేష్ కాగా ఇప్పుడు మరో బ్రాండ్ వచ్చి పడింది. తాజాగా వచ్చిన బ్రాండ్ ఏంటో తెలుసా ....... కార్ దేఖో ! అవును కార్ దేఖో అనే పోర్టల్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు మహేష్. సెకండ్ సేల్స్ లో సంచలనం సృష్టిస్తోంది కార్ దేఖో పోర్టల్.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్ లను సైన్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న మహేష్ మరోవైపు పెట్టుబడులను రకరకాల మార్గాల్లో పెడుతున్నాడు. ఇలా చేయడం ద్వారా వేలకోట్ల అధిపతి అవ్వడం ఖాయమని వినిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల భూములను కొన్నాడు అలాగే స్థిరాస్తులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. రాబోయే తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్థి కూడబెట్టాడు మహేష్ బాబు.