100 కోట్ల షేర్ సాధించిన మహేష్ బాబు

Published on Jan 18,2020 02:45 PM

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సరిలేరు నీకెవ్వరు అని అనిపించుకున్నాడు మహేష్ బాబు. జనవరి 11 న విడుదలైన సరిలేరు నీకెవ్వరు వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి ఆ సినిమాని కొన్న బయ్యర్లను లాభాల్లో ముంచెత్తాడు మహేష్. ఈ సినిమాని 101 కోట్లకు థియేట్రికల్ రైట్స్ కు అమ్మారు ప్రపంచ వ్యాప్తంగా. కాగా భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం 6 రోజుల్లోనే బయ్యర్ల పెట్టుబడి వచ్చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 75 కోట్లకు అమ్ముడు పోగా 78 కోట్ల షేర్ వచ్చింది అంటే ఇక్కడే మూడు కోట్ల వరకు లాభాలు అన్నమాట.

అలాగే ఓవర్ సీస్ లో కూడా దాదాపుగా పెట్టిన పెట్టుబడి వచ్చేసింది ఈరోజుతో వాళ్ళు కూడా లాభాలబాట పట్టినట్లే. ఇప్పటికే నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయ్యింది , ఇక ఇప్పుడేమో బయ్యర్లకు లాభాలు వస్తున్నాయి. కేవలం వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి వస్తుండటంతో సరిలేరు నీకెవ్వరు బృందం చాలా సంతోషంగా ఉంది. వారం రోజులు మాత్రమే పూర్తయ్యింది కాబట్టి మరో వారం , పది రోజుల పాటు మహేష్ బాబు థియేటర్ లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.