కొరటాలకు అభయమిచ్చిన మహేష్ బాబు

Published on Apr 18,2020 03:28 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకులు కొరటాల శివకు అభయమిచ్చాడట. ఏ విషయంలో అభయం ఇచ్చాడో తెలుసా ...... తాజాగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రంలో కీలక పాత్ర కోసం రాంచరణ్ ని అనుకున్నారట చిరంజీవి అలాగే కొరటాల శివ. కానీ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు వీలు అవుతుందో ? లేదో ? రాజమౌళి అనుమతి ఇస్తాడో? లేదో ?అనే డౌట్ లో ఉన్నప్పుడు మహేష్ బాబుని సంప్రదించాడట కొరటాల శివ.

చరణ్ కు డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే తప్పకుండా ఆ పాత్రని నేను చేస్తాను అని మరో మాట లేకుండా చెప్పాడట దాంతో షాక్ అయ్యాడట కొరటాల శివ. ఈ విషయం ఆ నోటా ఈ నోటా మీడియాకు పాకడంతో వార్తలు వచ్చాయి ఆచార్య చిత్రంలో మహేష్ బాబు అంటూ. కానీ చరణ్ డేట్స్ అడ్జెస్ట్ అయ్యాయట ! దాంతో మహేష్ బాబు కు చెప్పాడట కొరటాల. గతంలో మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు వచ్చాయి అందుకే కొరటాల అంటే మహేష్ కు అంత అభిమానం.