వంశీ పైడిపల్లిని తిడుతున్న మహేష్ ఫ్యాన్స్

Published on Mar 05,2019 12:50 PM

మహర్షి దర్శకులు వంశీ పైడిపల్లి ని తిడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . మహేష్ ఫ్యాన్స్ కు వంశీ పైడిపల్లి మీద ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... మహర్షి చిత్రం ఆలస్యం అవ్వడం ఒక కారణమైతే , మహర్షి చిత్రం నుండి టీజర్ , ట్రైలర్ లాంటిది ఏది రాకపోవడం కూడా మరో కారణం . దాంతో సోషల్ మీడియాలో వంశీ పైడిపల్లి పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు మహేష్ అభిమానులు . 

మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . ఏప్రిల్ 25 న భారీ ఎత్తున మహర్షి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .