జక్కన్న పై కోపంగా ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్

Published on Mar 15,2019 03:26 PM

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పై మహేష్ బాబు ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కీ రాజమౌళి మీద కోపం ఎందుకు అని అనుకుంటున్నారా? ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రకు గాను మహేష్ బాబు ని కాకుండా రాంచరణ్ ని తీసుకోవడమే కారణం . 

అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ మెప్పించాడు  ,మహేష్ కృష్ణ వారసుడు కాబట్టి ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో చరణ్ కు బదులుగా మహేష్ బాబు ని తీసుకుని ఉంటే బాగుండని కానీ చరణ్ ని తీసుకుని తప్పు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు.