ఆత్మహత్య చేసుకున్న మహేష్ బాబు అభిమాని

Published on Mar 04,2020 04:04 PM

మహేష్ బాబు అంటే పడిచచ్చే మహిళా అభిమాని పద్మజ ఆత్మహత్య చేసుకుంది. చెన్నై లో నివాసం ఉండే పద్మజకు మహేష్ బాబు అంటే విపరీతమైన ఇష్టం. మహేష్ బాబు కోసం ఆమె తన చేతిలో కర్పూరాన్ని పెట్టుకొని వెలిగించి హారతి ఇచ్చి సంచలనం సృష్టించింది. అలాంటి వీరాభిమాని అయిన పద్మజ బుల్లితెర నటి కూడా. తమిళనాట కొన్ని సీరియల్ లలో నటించింది కూడా ఈ పద్మజ.

23 ఏళ్ల పద్మజకు పెళ్లి అయ్యింది అయితే భర్త తో తీవ్ర విబేధాలు తలెత్తడంతో అతడికి దూరంగా ఉంటోంది. పలు సీరియల్ లలో నటించే పద్మజకు కొన్ని రోజులుగా సరైన అవకాశాలు రావడం లేదు అలాగే ఆర్ధిక ఇబ్బందులు కూడా అధికం కావడంతో తమిళనాడులోని తిరువొట్టియూర్ అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ బాబు వీరాభిమాని ఆత్మహత్య చేసుకోవడంతో మహేష్ అభిమానుల్లో తీవ్ర కలకలం చెలరేగింది.