రెండు పాటలు మినహా మహర్షి షూటింగ్ పూర్తి

Published on Apr 01,2019 12:32 PM

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది . ఇక బ్యాలెన్స్ గా ఉన్న రెండు పాటల్లో ఒక పాటని హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వేసి మరీ చిత్రీకరిస్తున్నారు నిన్నటి నుండి . మహేష్ బాబు - పూజా హెగ్డే ల పై తెరకెక్కిస్తున్నారు రొమాంటిక్ సాంగ్ ని . ఇక ఈ పాట అయ్యాక దుబాయ్ లో మరో పాట షూట్ చేయనున్నారు దాంతో మహర్షి కంప్లీట్ అవుతుంది . 

మే 9 న మహర్షి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు . అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు . మే మొదటివారంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు .