మహేష్ బాబు కూతురు సితార కు గోల్డెన్ ఛాన్స్

Published on Nov 12,2019 10:38 AM
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కు గోల్డెన్ ఛాన్స్ లభించింది. మహేష్ కూతురు సితార కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ని పెట్టిన సితార ఆ ఛానెల్ తో ఆదాయం కూడా పొందుతోంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్ని సంస్థ నుండి వస్తున్న ప్రాజెన్ 2 చిత్రానికి డబ్బింగ్ చెప్పనుంది సితార. 

ప్రాజెన్ 2013 లో విడుదలై సంచలన విజయం సాధించింది దాంతో ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ప్రాజెన్ 2. ఆ చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనుంది. ఈ విషయాన్ని డిస్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. సితార డబ్బింగ్ చెప్పడం అంటే మహేష్ బాబు అభిమానులకు సంతోషకరమైన విషయమనే చెప్పాలి.