మహేష్ కూతురు సితార డ్యాన్స్ ఇరగదీసింది

Published on Dec 22,2019 09:21 AM
హి ఈజ్ సో క్యూట్ .... హి ఈజ్ సో స్వీట్ అంటూ సాగే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది మహేష్ బాబు కూతురు సితార. మహేష్ బాబు గారాలపట్టి అయిన సితార పాటలు బాగా పాడుతుందన్న సంగతి తెలిసిందే. పాటలు పాడటమే కాకుండా డ్యాన్స్ లు కూడా బాగా చేస్తుందన్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే పలు పాటలతో , డ్యాన్స్ లతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిన సితార తాజాగా మహేష్ బాబు చిత్రంలోని హి ఈజ్ సో క్యూట్ ..... హి ఈజ్ సో స్వీట్ అనే పాటలో డ్యాన్స్  ఇరగదీసింది. 

సితార చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త సినిమాల్లోని పాటలను వింటూ , పాడుతూ తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్న సితార తాజాగా మరోసారి డ్యాన్స్ తో అలరించింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు ని టీజ్ చేస్తూ హీరోయిన్ రష్మీక మందన్న పై ఆ పాటని చిత్రీకరించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని జనవరి 11 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.