టీజర్ తో సంచలనం సృష్టిస్తున్న మహేష్ బాబు

Published on Nov 23,2019 12:44 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా టీజర్ సరిలేరు నీకెవ్వరు టీజర్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. ఈరోజు దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సరిలేరు నీకెవ్వరు టీజర్ ని విడుదల చేసారు నిన్న సాయంత్రం. టీజర్ అలా విడుదల అవ్వడమే ఆలస్యం వ్యూస్ పరంగా రికార్డుల మోత మోగిస్తూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు మహేష్ బాబు.

10 మిలియన్ వ్యూస్ ని కేవలం ఆఫ్ డే లో సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు మహేష్ బాబు. నిమిషం కు పైగా ఉన్న టీజర్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు మహేష్ బాబు. మేజర్ ఆర్మీ పాత్రలో నటిస్తున్న మహేష్ కర్నూల్ ఫ్యాక్షనిజం ని అణగదొక్కే తీరు కి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 11 న విడుదల చేయనున్నారు అయితే ఈ టీజర్ లో రష్మిక మందన్న కనిపించలేదు అదే లోటు.