బెంగుళూర్ లో మల్టీప్లెక్స్ కట్టనున్న మహేష్

Published on Jan 26,2020 04:23 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే హైదరాబాద్ లో ఏ ఎం బి అనే మల్టీప్లెక్స్ ని కట్టి సరికొత్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఇప్పటికే బహుళ జనాదరణ పొందింది. ఈ మల్టీప్లెక్స్ లలో పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా సినిమాలను చూస్తున్నారు. ఏ ఎం బి కి ఆదరణ అద్భుతంగా లభిస్తుండటంతో ఇలాంటి మల్టీప్లెక్స్ మళ్ళీ నిర్మించాలనే ఆలోచనకు వచ్చారట మహేష్ బాబు - నమ్రతలు అందుకు సరైన వేదిక బెంగుళూర్ అని డిసైడ్ అయ్యారట కూడా.
              
కర్ణాటక రాజధాని బెంగుళూర్ లో కూడా తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్నారు అలాగే అక్కడ అని భాషల చిత్రాలు కూడా విడుదల అవుతుంటాయి కాబట్టి ఇదే తరహా మల్టీప్లెక్స్ ని బెంగుళూర్ లో కట్టాలని భావిస్తున్నారట. ఆమేరకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారట మహేష్ - నమ్రతలు. మహేష్ బాబు కు భారీ రెమ్యునరేషన్ లభిస్తుండటంతో దాన్ని ఇలా రకరకాల మార్గాల్లో పెట్టుబడులు పెట్టి స్థిరాస్థులు పెంచుకుంటున్నారు.