గూఢచారిగా మహేష్ బాబు

Published on Jan 24,2020 09:53 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గూఢచారిగా నటించనున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటించి మెప్పించి బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. మహర్షి వంటి సూపర్ హిట్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో రావడంతో వంశీకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ఇక ఆ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్ గా మహేష్ నటించనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కైరా అద్వానీ భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు సరసన నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో పాటుగా మహేష్ కు మంచి జోడీగా పేరు తెచ్చుకుంది కైరా అద్వానీ అందుకే ఆ భామని మళ్ళీ తీసుకోవాలని అనుకుంటున్నారట. గూఢచారిగా మహేష్ ఎలా అలరించనున్నాడో తెలియాలంటే ఈ ఏడాది ఆఖరు వరకు ఆగాల్సిందే.