మాఫియా డాన్ గా మహేష్ బాబు

Published on Dec 06,2019 04:27 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాఫియా డాన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు మహేష్ . ఆ సినిమాని జనవరి 11 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఆ సినిమా తర్వాత మళ్ళీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో మహేష్ మాఫియా డాన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.

బిజినెస్ మెన్ చిత్రంలో కూడా మహేష్ మాఫియా డాన్ గా నటించాడు అయితే అది క్లాస్ గా ఉంటుంది కానీ వంశీ పైడిపల్లి తెరకెక్కించ నున్న మాఫియా డాన్ మాత్రం మాస్ ని అలరించేలా ఉంటుందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇంతకుముందు మహర్షి అనే చిత్రంలో నటించాడు మహేష్. అది తనకు మంచి పేరుని తెచ్చిపెట్టడంతో వంశీ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు.