పారిశుద్ద కార్మికులను పొగుడుతున్న మహేష్ బాబు

Published on Apr 16,2020 07:04 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పారిశుద్ద కార్మికులను ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న మహనీయులంటూ వారికీ సలాం కొడుతున్నాడు మహేష్. కరోనా వల్ల అత్యధిక శాతం జనాలు ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక రోడ్ల మీద తిరుగుతోంది కేవలం పోలీసులు , పారిశుద్ద కార్మికులు.

రాత్రనక పగలన పోలీసులు , డాక్టర్లు , నర్స్ లు , పారామెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే పరిసరాలను శుభ్రం చేస్తూ మరిన్ని రోగాలు ప్రబలకుండా చెత్త చెదారాన్ని తీసివేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు పారిశుద్ద కార్మికులు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న వాళ్లకు సెల్యూట్ అంటున్నాడు మహేష్. కరోనా వల్ల మనమంతా ఇంట్లోనే ఉంటున్నాం కానీ వీళ్ళు మాత్రం పనిచేస్తున్నారు అంటూ ట్వీట్ చేసాడు మహేష్.