మహేష్ కొత్త టైటిల్ హరహర శంభో శంకర

Published on Jan 21,2019 12:16 PM

మహేష్ బాబు కోసం హరహర శంభో శంకర అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది . తాజాగా మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు . ఆ సినిమా కోసమే హరహర శంభో శంకర టైటిల్ ని నిర్ణయించినట్లు తెలుస్తోంది . ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు . 

మహర్షి సినిమా ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆ సినిమా రిలీజ్ అయ్యాక సుకుమార్ - మహేష్ బాబు ల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . ఇంతకుముందు మహేష్ బాబు - సుకుమార్ ల కాంబినేషన్ లో 1 నేనొక్కడినే సినిమా వచ్చింది కానీ అది ప్లాప్ అయ్యింది దాంతో ఇప్పుడు చేసే సినిమా తప్పకుండా హిట్ చేయాలన్న కసితో ఉన్నాడు సుకుమార్ .