ఫేక్ రికార్డులతో పోటీ పడుతున్న మహేష్ - అల్లు అర్జున్

Published on Jan 17,2020 03:54 PM

జనవరి 11 న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల కాగా జనవరి 12న అల్లు అర్జున్ నటించిన అల .... వైకుంఠపురములో చిత్రం విడుదల అయ్యింది దాంతో పెద్ద చిక్కొచ్చి పడింది. మా సినిమా సంక్రాంతి మొనగాడు అంటే లేదు లేదు మా సినిమా సంక్రాంతి విన్నర్ అంటూ ఫేక్ కలెక్షన్స్ రిపోర్ట్ ని మీడియాకు వదులుతూ ఒకరి మీద మరొకరు పోటీ పడుతున్నారు మహేష్ బాబు - అల్లు అర్జున్ లు. నిజానికి ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగి చాలా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

అయితే ఆ విషయాన్నీ పక్కకు పెట్టి మా సినిమా నెంబర్ వన్ అంటే లేదు లేదు మా సినిమా నెంబర్ వన్ అంటూ ఫేక్ కలెక్షన్స్ ని చూపిస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మరింత చులకన అయ్యే ప్రమాదం ఉంది కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోవడమే లేదు. ఎవరేమి అనుకుంటే మాకేంటి ? మా తప్పుడు లెక్కలు మేము చూపిస్తాం ....... మేమే గొప్ప అని నిరూపించుకుంటాం అంటూ లెక్కలు పంపిస్తూనే ఉన్నారు ట్రేడ్ వర్గాలు కూడా నివ్వెర పోయేలా ?