11న మహేష్ 12 న అల్లు అర్జున్ ల సినిమాలు

Published on Nov 22,2019 05:06 PM

జనవరి 11 న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు , జనవరి 12 న అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రాలు విడుదల కానున్నాయని తాజాగా వెల్లడించారు టాలీవుడ్ నిర్మాతలు. అసలు ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే జనవరి 12న విడుదల అంటూ ఇద్దరూ పోటీపడి ప్రకటించారు కట్ చేస్తే ఒకే రోజున ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు విడుదల కావడం వల్ల ఇబ్బందులు తప్పవు కాబట్టి సినిమారంగంలోని ప్రముఖులు కూర్చొని ఈరకంగా రాజీ ఫార్ములా చేసారు.

తాజా నిర్ణయం ప్రకారం సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న అల వైకుంఠపురములో జనవరి 12 న విడుదల అవుతున్నాయి. ఒక రోజు తేడాలో వస్తున్న ఈ చిత్రాల వల్ల కొంత వరకు మాత్రమే పోటీ తగ్గింది అని చెప్పాలి. సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద చిత్రాలు విడుదలైనా ఫరవాలేదు ప్రేక్షకులు ఆదరిస్తారు అని చాలాకాలంగా ప్రూవ్ అవుతూనే ఉంది. ఆ కోవలోనే ఇప్పుడు మహేష్ బాబు , అల్లు అర్జున్ ల చిత్రాలు విడుదల అవుతున్నాయి.