విజయనిర్మల బయోపిక్ లో మహానటి హీరోయిన్

Published on Apr 26,2020 04:29 PM
హీరో కృష్ణ భార్య విజయనిర్మల చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె హీరోయిన్ గా , నిర్మాతగా , దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. దర్శకురాలిగా సంచలన విజయాలు అందుకున్న విజయనిర్మల బయోపిక్ తీయాలని భావిస్తున్నాడు ఆమె తనయుడు సీనియర్ నటుడు నరేష్. తన తల్లి విజయనిర్మల పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట నరేష్. ఆమేరకు కీర్తి సురేష్ తో సంప్రదింపులు చేస్తున్నాడట నరేష్.

మహిళా దర్శకురాలిగా సంచలనం సృష్టించిన విజయనిర్మల లిమ్కా గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించింది. 50 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించింది విజయనిర్మల. ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే ...... మహానటి చిత్రంతో అచ్చం మహానటి సావిత్రిని దించేసింది కీర్తి సురేష్. ఆ తర్వాత కీర్తి సురేస్ కీర్తి ప్రతిష్టలు పెరిగాయి కానీ కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. మరి విజయనిర్మల బయోపిక్ లో నటిస్తుందా ? కమర్షియల్ గా సత్తా చాటుతుందా ? అన్నది చూడాలి.