నిర్మాతగా మారిన మహానటి దర్శకుడు

Published on Oct 25,2019 01:24 PM

మహానటి వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ తాజాగా '' జాతి రత్నాలు '' అనే చిత్రంతో నిర్మాతగా మారాడు. మహానటి చిత్రంతో ఒక్కసారిగా దక్షిణాది దృష్టిని ఆకర్షించాడు నాగ్ అశ్విన్. చిన్న వయసులోనే మహానటి సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించిన తీరుకి అక్కడక్కడా కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కువగా ప్రశంసలే దక్కాయి నాగ్ అశ్విన్ కు.
అయితే మహానటి తర్వాత ఇంతవరకు తన కొత్త చిత్రం ఏంటి ? అన్నది ప్రకటించలేదు ఈ దర్శకుడు. పెద్ద హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు కానీ ఇంకా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు అందుకే ఇలా జాతి రత్నాలు అనే ఓ చిన్న సినిమాని నిర్మించాడు. దర్శకుడు అయి ఉండి కూడా ఇలా జాతి రత్నాలు అనే సినిమా నిర్మించడం విశేషమే మరి.