ఆ నటి ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించిందో తెలుసా ?

Published on Sep 10,2019 11:40 AM

తమిళ నటి మధుమిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడంతో బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు పంపేశారు అంతేకాదు ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టారట! అయితే ఈ సంఘటన ఆగస్టు 15 న జరిగింది. కాగా ఇప్పుడు ఆ సంఘటన గురించి వివరిస్తోంది తమిళ నటి మధుమిత. తమిళ బిగ్ బాస్ లో మాకు టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ ప్రకారం తమిళనాట నీళ్ల సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ సమస్య తీవ్రతని గుర్తు చేయాలనీ అనుకున్నా అంతే!
అయితే హౌజ్ లో ఉన్న వాళ్లలో ఇద్దరు మినహా మిగతావాళ్ళు నన్ను అవమానించారు , అలాగే బిగ్ బాస్ ఓ లెటర్ పంపించాడు హౌజ్ లో రాజకీయాలు చేయొద్దని ఇక కమల్ సార్ కూడా ఈ విషయం పై జోక్యం చేసుకుంటాడని అనుకున్నాను కానీ అతడు జోక్యం చేసుకోలేదు దాంతో హౌజ్ లో ఉన్నవాళ్లు నన్ను హేళన చేయడంతో అది తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాను అంటూ వివరణ ఇచ్చింది. అంతేకాదు కర్ణాటకలో భారీ వరదలతో నీళ్లు వ్యర్థం అవుతున్నాయి కానీ తమిళనాడుకు మాత్రం నీళ్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అంటూ ఆవేదన వెలిబుచ్చింది నటి మధుమిత.