వాళ్ళ ప్రేమకు అయిదేళ్లట !

Published on Feb 15,2020 09:01 PM

నయనతార - దర్శకుడు విగ్నేష్ శివన్ ల ప్రేమకు ఐదేళ్లు నిండాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మధ్యలో నయనతార - విగ్నేష్ శివన్ ల ఆమధ్య తీవ్ర విబేధాలు వచ్చాయని ఇక త్వరలోనే వాళ్ళు విడిపోవడం ఖాయమని పుకార్లు షికారు చేసాయి. అయితే ఆ వార్తలకు ఊతమిచ్చేలా నయనతార సింగిల్ గా ఈవెంట్ లకు హాజరుకావడంతో నిజమే అనుకున్నారు. కట్ చేస్తే మేము విడిపోలేదు కలిసే ఉన్నామంటూ సంకేతాలు అందించారు.

నయనతార -శింబు ప్రేమాయణం టాలీవుడ్ లో కానో కోలీవుడ్ లో కానీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి కావడమే తరువాయి అన్న సమయంలో శింబు తండ్రి రాజేందర్ ఒప్పుకోకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. కట్ చేస్తే డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా తో పీకల్లోతు ప్రేమాయణం సాగించింది. ఇక పెళ్లి కావడమే ఆలస్యం కానీ ఆ పెళ్లి కూడా వాయిదాపడింది. దాంతో అప్పటి నుండి నయనతారకు పెళ్లి మీద నమ్మకం పోయింది. అందుకే విగ్నేష్ తో సహజీవనం చేస్తోంది ఎవరు ఏమన్నా డోంట్ కేర్ అంటూ.