సుడిగాలి సుధీర్ తో సినిమా తీసి నష్టపోయాడట !

Published on Feb 03,2020 06:43 PM

యాంకర్ సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా తీసి పెద్ద మొత్తంలో నష్టపోయానని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆ చిత్ర  నిర్మాత శేఖర్ రాజు. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ డిసెంబర్ 27 న విడుదలై అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో రోడ్డున పడ్డానని అంటున్నాడు ఆ చిత్ర నిర్మాత శేఖర్ రాజు.

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల నా దగ్గరకు వచ్చి తక్కువ బడ్జెట్ లో సినిమా చేస్తానని అంటే నమ్మి పెట్టుబడి పెట్టానని , అయితే నాకు చెప్పిన బడ్జెట్ కు అయిదు రెట్లు ఎక్కువ సినిమాకు ఖర్చు పెట్టారని దాని వల్ల సినిమా విడుదల చేయడానికి బ్యాంక్ లో మరికొంత అప్పు చేయాల్సి వచ్చిందని మొర పెట్టుకుంటున్నాడు ఆ నిర్మాత. నాకు సినిమాలంటే ఇష్టం దాంతో దారుణంగా మోసపోయానని బాధపడుతున్నాడు శేఖర్ రాజు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.