టాటూని ఎక్కడ వేయించుకుందో చూడు

Published on Jan 09,2020 01:17 PM

సమంత తన భర్త హీరో నాగచైతన్య పేరు ని టాటూగా వేయించుకుంది అయితే ఆ టాటూ ఎక్కడ వేయించుకుంది అన్నది సంచలనంగా మారింది పైగా తన టాటూ ని కనిపించేలా ఫోటో షూట్ చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తోంది కూడా. కుడివైపున ఎద భాగం పూర్తిగా కింద నడుముకి పైన కనిపించేలా ''చై '' ( నాగచైతన్య ముద్దుపేరు ) అని టాటూ వేయించుకుంది సమంత. తాజాగా సమంత చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. సమంత ఫోటోలపై కొంతమంది పాజిటివ్ గా మరికొంతమంది నెగెటివ్ గా స్పందిస్తున్నారు.

గత ఏడాది మజిలీ , ఓ బేబీ వంటి సూపర్ హిట్స్ అందుకుంది సమంత. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ డీలక్స్ అనే తమిళ సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసింది దాంతో అవార్డు కొట్టేసింది ఆ చిత్రంలోని నటనకు గాను. నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను కదా! విమర్శలు వస్తాయని భయపడిందట కానీ ఆ క్యారెక్టర్ కు ప్రశంసలు లభించాయి కానీ ఇలా భర్త పేరు కనిపించేలా స్కిన్ షో చేయడంతోనే విమర్శలు వస్తున్నాయి సమంత మీద.