సారీ చెప్పిన లారెన్స్

Published on Dec 15,2019 06:31 PM

కమల్ హాసన్ పై లారెన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండటంతో అవి మరింతగా పెద్దవి కాకముందే మేల్కొన్న రాఘవ లారెన్స్ కమల్ హాసన్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు. తాను ఏ సందర్భంలో ఆ మాటలు అనాల్సి వచ్చిందో కమల్ కు వివరించి క్షమాపణ కోరాడు. లారెన్స్ తనని కలిసి సారీ చెప్పడంతో శాంతించిన కమల్ లారెన్స్ ని దగ్గరకు తీసుకొని ఫోటోలకు ఫోజిచ్చాడు ఇంకేముంది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ లారెన్స్ తో దిగిన ఫోటో పెట్టి కమల్ హాసన్ గారు అంటే నాకు చాలా గౌరవం అంటూ తన భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు లారెన్స్.

అయితే కమల్ హాసన్ అభిమానులకు లారెన్స్ అంటే ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ..... ..... రజనీకాంత్ కు వీరాభిమాని అని చెప్పుకోవడమే కాకుండా కమల్ హాసన్ పోస్టర్ లపై పేడ వేశానని లారెన్స్ స్టేట్ మెంట్ ఇవ్వడమే ! రజనీకాంత్ మీద ఉన్న అభిమానంతో కమల్ పై ద్వేషం పెంచుకొని అతడి సినిమాలు విడుదల అయినప్పుడు ఆ పోస్టర్ లపై పేడ వేసేవాడట లారెన్స్. అయితే ఈ విషయాన్నీ బయటకు చెప్పడంతో కమల్ ఫ్యాన్స్ లారెన్స్ ని తిట్టడం మొదలు పెట్టారు. ఈ తిట్ల దండకం మరీ ఎక్కువ కావడంతో కమల్ ని కలిసి సారీ చెప్పాడు లారెన్స్.