ఆ సినిమా విడుదల అవుతుందా ?

Published on Mar 11,2019 11:12 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విలన్ గా చూపిస్తూ రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం '' లక్ష్మీస్ ఎన్టీఆర్ ''. ఈ చిత్రాన్ని ఈనెల 22న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ సినిమా సకాలంలో విడుదల అవుతుందా ? అంటే డౌటే ! ఎందుకంటే లక్ష్మీపార్వతి ని మంచిగా చూపిస్తూ చంద్రబాబుతో పాటుగా ఎన్టీఆర్ కుటుంబాన్ని మొత్తం విలన్ గా అందునా చంద్రబాబు నాయుడు ని పూర్తిస్థాయి విలన్ గా చూపిస్తున్నారు . 

ఇప్పటికే టీజర్ , ట్రైలర్ , వీడియో సాంగ్ లలో చంద్రబాబుని విలన్ గా చూపిస్తున్న సన్నివేశాలు తెలుగుదేశం శ్రేణుల్లో ఆగ్రహాన్ని నింపాయి . అలాగే ఎన్టీఆర్ కుటుంబంలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకంపనలు సృష్టిస్తోంది . దాంతో ఈ సినిమాని అడ్డుకోవడానికి న్యాయ పరంగా ఆలోచనలు చేస్తున్నారు . ఒకవేళ సినిమా రిలీజ్ ఆగిపోతే మాత్రం యూట్యూబ్ లో నైనా రిలీజ్ చేస్తా అని అంటున్నాడు వర్మ . అయితే న్యాయపరంగా చిక్కులు వస్తే ఏం చేయాలో కూడా ఆలోచన చేస్తున్నాడట వర్మ . మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్ లో బొమ్మ పడేంత వరకు తెలీదు రిలీజ్ అయ్యిందా ? లేదా ? అనేది .