లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ టాక్

Published on Feb 14,2019 12:36 PM

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ . ఈరోజు ట్రైలర్ ని రిలీజ్ చేసాడు వర్మ . గతకొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడి ని అలాగే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని టార్గెట్ చేసిన వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ తో మరోసారి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసాడు . 

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు ని విలన్ గా చూపించాడు వర్మ . ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ని పెళ్లి చేసుకొని తప్పు చేయలేదని , చంద్రబాబు ని నమ్మి తప్పు చేసాడని చూపించాడు ట్రైలర్ . ఇక ట్రైలర్ లోనే ఇలా ఉంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎన్ని వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందో . 


 ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి