సెటైర్ వేసిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి

Published on Apr 16,2020 05:53 PM
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి మీడియాలోని కొంతమంది పై బాగానే సెటైర్ వేసింది. అంతేకాదు పూర్ రేటింగ్ కూడా ఇచ్చింది. 1/5 అనే రేటింగ్ ఇచ్చి మీ వాదనలో పసలేదు , ఈసారి మరింతగా శ్రమించి మంచి రేటింగ్ తెచ్చుకోండి అంటూ సెటైర్ వేసింది. ఈ లేడీ డైరెక్టర్ కు కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ...... ఇటీవల కాలంలో నందిని రెడ్డి- సమంత కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని , అది రీమేక్ సినిమా అంటూ వార్తలు రాయడమే కారణం.

నా తదుపరి సినిమా రీమేక్ కాదు అలాగే సమంతతో కూడా కాదు. నా తదుపరి సినిమా స్వప్న సినిమా పతాకంపై స్వప్న దత్ నిర్మించనుంది పైగా తెలుగు స్ట్రైట్ సినిమా అంటూ ట్వీట్ చేసి కాస్త అగ్గి రాజేసింది. సినీ విమర్శకులపై ఘాటుగానే స్పందించినట్లు ఉంది నందిని రెడ్డి. అయితే సినిమాలకు రేటింగ్ లు ఇచ్చినట్లుగా 1/5 ఇవ్వడం అంటే నేరుగా విమర్శకులను టార్గెట్ చేసినట్లే !