పెళ్లైన వాడ్ని ప్రేమిస్తున్న హీరోయిన్

Published on Nov 19,2019 04:49 PM

హీరోయిన్ కృతి కర్బందా పెళ్ళైన హీరో ని ప్రేమిస్తోంది , అంతేకాదు నేను ఫలానా వాడ్ని ప్రేమిస్తున్నాను మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ కృతి కర్బందా ప్రేమిస్తోంది ఏ హీరోనో తెలుసా ? అతడు ఎవరో తెలుసా ? ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా ....... కృతి ప్రేమికుడు '' పులకిత్ సామ్రాట్ ''. ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకుంది సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు శ్వేతా రోహిరాని.

సల్మాన్ ఖాన్ కు రాఖీ కట్టి చెల్లెలు అయిన శ్వేతా రోహిరా - పులకిత్ సామ్రాట్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత కాలానికే ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు రావడంతో విడిపోయారు. ఇంకేముంది ఇప్పుడు హీరోయిన్ కృతి కర్బందా తో ప్రేమలో ఉన్నాడు . ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటూ కృతి కర్బందా చెప్పేసింది. అన్నట్లు కృతి కర్బందా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కానీ ఏది కూడా సక్సెస్ కాలేదు దాంతో ఈ భామకు తెలుగులో ఛాన్స్ లు లేకుండాపోయాయి.