క్రిష్ కు కోపం తెప్పించిన సమంత ట్వీట్

Published on Jan 31,2019 01:12 PM

మణికర్ణిక చిత్రంలో కంగనా రనౌత్ అద్భుత నటన ప్రదర్శించిందని , ఆమె నా అభిమాన హీరో అంటూ కంగనా పై ప్రశంసలు కురిపించడమే కాకుండా కంగనా రనౌత్ కే నా మద్దతు అంటూ ట్వీట్ చేసి దర్శకులు క్రిష్ కు కోపం వచ్చేలా చేసింది సమంత .  అంతేకాదు అవమానించింది కూడా . అసలే మణికర్ణిక చిత్రానికి ఎవరు ఎక్కువ శాతం దర్శకత్వం వహించారు అన్న గొడవ జరుగుతోంది నేను బాగా తీసాను కంగనా అంతా చెడగొట్టింది అని క్రిష్ అంటుంటే..  క్రిష్ మణికర్ణిక చిత్రాన్ని భోజ్ పురి సినిమాలా తీసాడు అందుకే మళ్ళీ రీ షూట్ చేయాల్సి వచ్చింది నా వల్లే మణికర్ణిక ఇలా ఉంది అని కంగనా అంటోంది . ఈ వివాదానికి ఆజ్యం పోసేలా సమంత ట్వీట్ ఉంది . కంగనా అద్భుతంగా నటించింది , నా సపోర్ట్ కంగనా కే అని ట్వీట్ చేయడం అంటే క్రిష్ ని అవమానించడమే కదా !