హీరో రాజశేఖర్ తమ్ముడిపై దాడి

Published on Feb 05,2019 11:51 AM

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పై దాడి చేసాడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి . ఫిబ్రవరి 3 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ హైదరాబాద్ లో గుణ డైమండ్స్ అండ్ జువెల్లర్స్ షాప్ నిర్వహిస్తున్నాడు . కాగా అతడి షాప్ ముందు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తన కారుని పార్క్ చేసి పక్కనే ఉన్న పబ్ కి  వెళ్ళిపోయాడు . 

అయితే తన షాప్ ముందు పార్క్ చేసి వెళ్లిన కౌశిక్ రెడ్డి ని ఇక్కడ ఎందుకు పార్క్ చేసావని గుణ అడగడంతో వివాదం మొదలయ్యింది , ఆ వివాదం ఎక్కువ కావడంతో గుణశేఖర్ పై దాడి చేసి కొట్టాడు కౌశిక్ రెడ్డి . దాంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు గుణ . ఆ తర్వాత తన వదిన జీవితతో కలిసి కౌశిక్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు గుణశేఖర్ . కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బంధువు కావడం విశేషం .