సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కొరటాల శివ

Published on Apr 16,2020 07:09 PM
దర్శకులు కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరో 5 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడట. మిర్చి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. ఆ తర్వాత శ్రీమంతుడు వంటి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత జనతా గ్యారేజ్ అంటూ మరో సూపర్ హిట్ ఇచ్చాడు. ఆసినిమా తర్వాత భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు నాలుగు చిత్రాలు చేస్తే నాలుగు కూడా సూపర్ డూపర్ హిట్ లే !

ఇక ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా అయిదవది కొరటాలకు. ఈ సినిమా తర్వాత మరో 5 సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తర్వాత దర్శకత్వానికి గుడ్ బై చెప్పనున్నాడట. అంటే ఆ 5 సినిమాలు తీయడానికి అవలీలగా 5 ఏళ్లకు పైగానే సమయం పడుతుంది కాబట్టి ఆ తర్వాత మాత్రం నిర్మాతగా కొనసాగవచ్చని తెలుస్తోంది.