గర్భం దాల్చిన కియార అద్వానీ

Published on Nov 15,2019 12:08 AM
హాట్ భామ కీయారా అద్వానీ గర్భం దాల్చిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీయరా అద్వానీ గర్భం దాల్చడం ఏంటి ? ఇంకా పెళ్లి కాలేదు కదా ? అని అనుకుంటున్నారా ? నిజంగా కాదండి సినిమా కోసం గర్భవతిగా మారింది. గుడ్ న్యూస్ అనే బాలీవుడ్ సినిమాలో కృత్రిమ గర్భం దాల్చే యువతిగా నటించింది. ఒక్క కియార అద్వానీ మాత్రమే కాదు కరీనా కపూర్ కూడా గర్భవతి గా నటించింది . ఇక హీరోగా అక్షయ్ కుమార్ నటించాడు. 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ ని విడుదల చేశారు. డిసెంబర్ 27 న గుడ్ న్యూస్ సినిమా విడుదల కానుంది. అక్షయ్ కుమార్ , కరీనా కపూర్ , కియార అద్వానీ నటించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఇప్పటికే హౌజ్ ఫుల్ 4 చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు అక్షయ్ కుమార్. ఇప్పటికే ఆ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని సాధించింది. ఇక డిసెంబర్ లో గుడ్ న్యూస్ తో మరో హిట్ కొట్టేలాగే కనబడుతున్నాడు అక్షయ్. కీయరా కూడా ఈ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తోంది.